ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఈనెల 22న, కర్నూలు పట్టణంలోని, జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగే నా యొక్క ఆత్మీయ అభినందన సభకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ పదవులలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం పంపుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, శాసనసభ్యులు బొగ్గుల.దస్తగిరి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి, కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, కె.వి.సుబ్బారెడ్డి, విద్యా సంస్థల చైర్మన్ కె.వి.సుబ్బారెడ్డి, తదితర నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భముగా నాయకులు మాట్లాడుతూ ఆత్మీయ అభినందన సభ టిడిపి, కూటమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా & సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్- జీ.నాగముని కి ఘనంగా సన్మానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాధవ కృష్ణ, లాజరస్, నవీన్ బాబు, మహబూబ్ బాష, యుగంధర్, ప్రసాద్, మరికొందరు పాల్గొని, అందరికీ ఆహ్వానించడం జరిగింది.
Admin
E Nivas News