Thursday, 30 July 2026 11:44:30 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

వికసిత్ భారత్- జి రామ్ జి ఉపాధి హామీ నూతన సంకల్పం అవగాహన పోస్టర్లను విడుదల చేసిన ఎంపీడీవో ఎం.చంద్రశేఖర్, ఏపీవో- బి.జయంతి

Date : 03 March 2026 08:17 AM Views : 156

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు లోని, మండలం ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర ఏపీఓ-బి.జయంతి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ జి రామ్ జి గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం ఉపాధికి కొత్త హామీ పథకం అవగాహన పోస్టర్లను ఎంపీడీవో యన్.చంద్రశేఖర్, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ జె.లింగస్వామి, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న, ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ రాజు, మహిళా సంఘాల నాయకులతో, ఉపాధి హామీ శ్రామికులతో అవగాహన పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, ఏపీవో- బి.జయంతి, బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ లు అవగాహన కల్పిస్తూ వికసిత్ భారత్- జి రామ్ జీ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు 125 రోజుల పని, పని కల్పించని ఎడల నిరుద్యోగ భృతి కోసం మెరుగైన ఏర్పాటు, సమయానికి కూలి చెల్లింపు, ఆలస్యమైతే చెల్లింపులకు పరిహారము కల్పించడం జరుగుతుందన్నారు. పనుల గుర్తింపు కోసం గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాలు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతంగా, మెరుగైన ఉపాధి హామీతో, దృఢమైన నిబద్ధతతో, సవర్థ పాలన అదే వికసిత్ భారత్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదుపు మహిళా సంఘాల నాయకులు, ఉపాధి హామీ శ్రామికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :