ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలోని, కురుకుంద గ్రామంలో జల వనరుల రూపురేఖలను మార్చేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జలధార - జల హారతి' కార్యక్రమంలో భాగంగా సోమవారం సందడి వాతావరణం నెలకొంది. కురుకుంద గ్రామంలోని, చారిత్రాత్మక మాచ వీరప్ప చెరువును రూ.60 లక్షల భారీ వ్యయంతో ఒక మోడల్ ట్యాంక్ గా అభివృద్ధి చేసే పనులకు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చెరువు కట్టపై శాస్త్రోక్తంగా భూమిపూజ చేయడం జరిగింది. అనంతరం ఆయన స్వయంగా పోక్లయినర్ (జెసిబి) వాహనాన్ని నడిపి, మట్టిని తవ్వి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి, యంత్రాన్ని నడపడం అక్కడికి చేరిన గ్రామస్తులను, కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకుంది.
Admin
E Nivas News