Thursday, 30 July 2026 08:19:09 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆత్మకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో హోరెత్తిన వైఎస్ఆర్సిపి శ

Date : 12 November 2025 10:15 PM Views : 206

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో చంద్రబాబు వంచనపై శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు కదం తొక్కారు. స్వాతంత్ర్య భారతదేశంలో కనీవినీ ఎరుగని విధంగా 17 మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తూ వాటిని తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండిస్తూ శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి నేతృత్వంలో విద్యార్థులు,యువత, వైయస్ఆర్ సీపీ నాయకులు, మహిళలు రోడ్డెక్కారు. ఆత్మకూరు టౌన్ లోని నంద్యాల టర్నింగ్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించి, తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తన కోటరీకి ధారాదత్తం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్ర యువతకు ఆశాదీపమైన మెడికల్ కాలేజీలను తన స్వప్రయోజనాలకోసం తన మిత్రులకు,బినామీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నాడని నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి, పీపీపీ విధానం నిర్ణయానికి ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. లేదంటే వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని శిల్పా. చక్రపాణి రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి . నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పిపి.మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా. భువనేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్, మరియు వైయస్ఆర్ సీపీ నాయకులు మోమిన్ ముస్తఫా, విద్యార్థులు, యువకులు, మహిళలు ,వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :