ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలింపియాడ్ 2025-26 పరీక్షల్లో శ్రీ వివేకానంద విద్యా విహార్ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభను కనబరిచి 3 గోల్డ్ మెడల్స్ సాధించారు. అలాగే జోనల్ స్థాయిలో మరో ఏడు మంది విద్యార్థులు డిస్టింక్షన్ లెవెల్ టూ కి ఎంపికయ్యారు. 72 దేశాల్లో 96,466 పాఠశాల ల్లో సైన్స్ ఒలంపియాడ్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ పోటీలో లెవెన్ వన్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు లెవెల్- 2, 2025-26 కు అర్హత సాధించారు. ఈ నెల 8వ తారీఖున కర్నూల్ లోని మాంటిసోరి ఏ క్యాంపు హైస్కూల్లో యస్ ఓ యఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ లో జాతీయస్థాయి పరీక్షల్లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా 4వ, 6వ, 7వ, 9వ తరగతుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో ఎంపికై పాఠశాలకు గర్వకారణమయ్యారు అలాగే అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్ తో పాటు.. నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి ఇతర ఒలింపియాడ్ పరీక్షల్లో కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం విశేషం అన్నారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థుల్లో 4వ తరగతి – ఎం.ధోయా జాక్షి జూటూరు 6వ తరగతి, జి.వెంకట ఫణీంద్ర, తూడిచర్ల. వి. సింధు కృష్ణా నగర్, పి.వైష్ణవి తూడిచర్ల. జి.తమన్ బన్నూరు బి.నాగేంద్రుడు పాములపాడు. 9వ తరగతి – కె.కావ్య చెలిమిళ్ల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. అంతర్జాతీయ సైన్స్ ఒలంపియాడ్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు. బి.నాగేంద్రుడు. 6వ తరగతి,.వి.సింధు 6వ తరగతి.4 వ తరగతి యం.తోయ జూక్షి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని కరస్పాండెంట్ ఆర్ యస్ ఆర్.గోపాల్, బీసీ సంఘం అధ్యక్షులు రాయపాటి మురళి మోహన్ లు ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శనం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
Admin
E Nivas News