ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : అత్మకూరు మండలంలోని, కురుకుంద గ్రామానికి చెందిన డాక్టర్.మొహమ్మద్ ఫైజుల్లా , అన్నమయ్య జిల్లా, రాయచోటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ వారు రాష్ట్ర స్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ గౌరవ మంత్రి ఎన్.ఎం.డి. ఫారూక్ విజయవాడలోని, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జరిగిన ఘనమైన కార్యక్రమంలో ప్రదానం చేశారు. డా. ఫైజుల్ల ఈ గౌరవాన్ని తన విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకులందరికీ అంకితం చేస్తూ, వారి ప్రోత్సాహం మరియు మార్గదర్శకత తన విద్యా ప్రస్థానానికి బలమైన ప్రేరణగా నిలిచిందని తెలిపారు. డా. ఫైజుల్ల కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విశిష్ట పురస్కారం వచ్చినందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మరియు స్నేహితులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Admin
E Nivas News