Saturday, 13 June 2026 04:22:23 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జరిగిన మద్దూరు సుబ్బారెడ్డి 113 జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 04 December 2025 09:15 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మాట తప్పని, మడమ తిప్పని నేత విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఏకైక రాజకీయ నాయకుడు దివంగత మాజీ నంద్యాల పార్లమెంట్ సభ్యుడు మద్దూరు సుబ్బారెడ్డి అంటూ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కొనియాడారు. అయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేద్దాం అని అన్నారు. గురువారం నందికొట్కూరు మండలంలోని, బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాజీ పార్లమెంటు సభ్యులు, దివంగత మద్దూరు సుబ్బారెడ్డి 113వ జయంతి మరియు పాఠాశాల 64వ వార్షికోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో పాటు మద్దూరు సుబ్బారెడ్డి మనమడు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డి లు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే చదువుల తల్లి సరస్వతీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం దివంగత మహానేత మద్దూరు సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 324 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థాపించి వాటికి పునాది వేసి శంకుస్థాపన చేశారని ఆ మహానుభావుని ద్వారా నేడు ప్రతి గ్రామంలో విద్యను అభ్యసిస్తున్నామని విద్యార్థులకు గుర్తు చేశారు. అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల కోసం పాటుపడే ఏకైక వ్యక్తి మరియు ప్రజాభిమానాన్ని సంపాదించిన వ్యక్తి నిజాయితీ నిబద్ధత మారు పేరు మద్దూరు మద్దూరు సుబ్బారెడ్డిదే అన్నారు. శాసనమండలిలో ఏకగ్రీవ సభ్యుడుగా ఎన్నికైన వ్యక్తి మద్దూరు సుబ్బారెడ్డి అన్నారు. గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ వైద్యశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రామ సర్పంచ్ పదవి నుంచి మండల సమితి ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ ,శాసనమండలి సభ్యుడు మరియు పార్లమెంట్ సభ్యుడుగా అంచెలంచలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో యోధుడిగా పేరు సంపాదించుకున్నారన్నారు. చదువు సంపాదిస్తే జీవితాన్ని సంపాదించవచ్చని మద్దూరు సుబ్బారెడ్డి సహకారంతో ఎంతోమంది ఉద్యోగాలు పొంది ఉన్నతమైన హెూదాలో ఉన్నారని కొనియాడారు. అనంతరం మద్దూరు సుబ్బారెడ్డి జయంతి సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరం. ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని, గ్రామ సర్పంచ్ మరియమ్మ ,మాజీ ఎం పి టి సి ఖాజా మొహిద్దీన్, మాజీ సర్పంచ్ కాళీలుల్లా బేగ్, రెండో వార్డు కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, మిడుతూరు టీడీపీ మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఖలీల్ భేగ్, లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు రామిరెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పుల్లన్న, మాండ్ర.శివానందరెడ్డి పిఏ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :