Friday, 31 July 2026 08:15:31 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ - చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ

సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు

Date : 10 May 2026 09:11 PM Views : 335

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు ప్రపంచ తల్లుల దినోత్సవం సందర్భంగా తన భార్య టేకూరి.రేణుక, కుమారులు టేకూరి.యువ, టేకూరి.కుందన్, బంధుమిత్రులతో కలిసి భారీ కేక్ ను కటింగ్ చేసి, తన తల్లి అయిన మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ కు తినిపించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజ సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ.. పేరులో ప్రేమని.. అమ్మ పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ అని అన్నారు. అంత గొప్ప మానవత్వం ఉన్న అమ్మ, అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, అమ్మను ఎంత పొగిడినా తక్కువే అన్నారు. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుందనీ, అమ్మకు ప్రత్యామ్నాయం లేదనీ, అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ‘‘అమ్మ లేకపోతే జననం లేదనీ, అమ్మ లేకపోతే గమనం లేదనీ, అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదనీ, అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే అమ్మకి ‘ మదర్స్ డే శుభాకాంక్షలు అన్నారు. ‘‘కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే’’. ఓ మాతృ మూర్తి.. ‘మదర్స్ డే’ సందర్భంగా మీ కిదే మా వందనం అంటూ నినాదాలు చేశారు. పిల్లలు కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం, కుటుంబం కోసం అందర్నీ కనుపాపలుగా చూసుకుంటూ, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు...పాదాభివందనం చేస్తూ -హ్యపీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నం కలిపి గోరు ముద్దలు పెట్టేటప్పుడు తనకు బిడ్డపై ఉన్న ప్రేమను కూడా కలిపి తన పిల్లలకు పెడుతుందన్నారు. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ అమ్మ తయారుచేసిన ముద్దలు తింటుంటే... ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుందన్నారు. అమ్మ - ఒక కావ్యం కల్మషం లేని నవ్వు - అమ్మ,నిర్మలమైన మమతల కోవెల అని- అమ్మ,కష్టాన్ని దాచుకుని, నవ్వును పంచే - అమ్మ,నా ప్రాణానికి ఊపిరి అని - నా అమ్మ!కంటిపాపలా కాపాడే కవచం అని, - అమ్మ,లోకం రుచి చూపిన మొదటి గురువు అని - అమ్మ, ఏడవడానికి అయినా, తలదాచుకోవడానికి అయినా,అమ్మ ఒడిని మించిన స్వర్గం లేదనీ అన్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి. నాగేశ్వరరావు పేరుపేరునా హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నాగేశ్వరరావు యువ సైన్యం, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :