Friday, 31 July 2026 12:54:02 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ముంబై తెలుగు ప్రముఖులకు ఘన సన్మానం

Date : 12 May 2026 10:18 PM Views : 114

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / మహారాష్ట్ర/ముంబై : ముంబై బహుజనులు 1888, మే-11న ముంబై మాండవి కోలివాడలోని, ఓ మరాఠా జ్ఞాతి సమాజ్ హాలులో జరిగిన ఓ భారీ సభలో జ్యోతిరావుకు "మహాత్మా" బిరుదుతో సత్కరించారు. దేశంలోని ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు విద్య కోసం ఆయన చేసిన విప్లవాత్మక కృషికి గుర్తింపుగా ప్రజలు గౌరవించారు. అనాడు అందులో మరాఠా, కున్బి, అగ్రి, కోలి మాలి, బండారి లతోపాటు తెలుగు వారైన జయ కారాడి లింగు, ఈర్లా సాయన్న, వెంకయ్య కారాడి, జయ లింగన్న సాయన్న, శ్యాంబా మాగుజి హమంద్ తదితరులు ఆ ఐతిహాసిక ఉత్సవంలో పాల్గొనడం చరిత్రాత్మకం. దానిని నేడు జ్ఞాపకార్థంగా ముంబైలోని ప్రఖ్యాత ఓబీసీ ఎస్సీ తెలుగు ప్రముఖులను "రాష్ట్రపితా మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మ ద్విశతాబ్ది మహోత్సవ సమితి" ఆధ్వర్యంలో సోమవారం ప్రభాదేవిలోగల రవీంద్ర నాట్య మందిర్లో సత్కరించారు. అతిథులుగా మహారాష్ట్ర మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ చేతుల మీదుగా ప్రఖ్యాత తెలుగు కవి రచయిత అంబాల జనార్ధన్ కి ప్రశంస పత్రమీచ్చి "పూలే తలపాగా" శిరస్సుపై ధరించి, షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. మరాఠీ చిత్రలేఖ ఎడిటర్ జ్ఞానేష్ మహారావు కవి నడిమెట్ల ఎల్లప్ప లకు మహాత్మ జ్యోతిరావు పూలే పుస్తకం, సర్టిఫికెట్ ఇచ్చి, శాలువాలు కప్పి ఘనంగా గౌరవించారు. అదే రీతిలో యువనేత వంగల కృష్ణ యాదవ్, నవీముంబై నుంచి మందపెల్లి లక్ష్మణ్ నాయి, రజక యువనేత తడ్కపెల్లి నరేష్, అంబేడ్కరైట్ నేత వడ్డి సూర్యనారాయణ, సామల లక్ష్మణ్ యాదవ్, దాసరి రాజేంద్ర పద్మశాలి, మూలనివాసి మాలజీలను సత్కరించారు. సభకు రోహిత్ డాలే వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :