Thursday, 30 July 2026 10:38:44 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రభుత్వం పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి - 30% మధ్యంతర భృతి చెల్లించాలి

పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కృష్ణయ్య

Date : 07 December 2025 07:24 PM Views : 561

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ఈ రోజు నంద్యాల పట్టణంలోని, రామకృష్ణ పీజీ కాలేజ్ లో జిల్లా పిఆర్టియు కార్యవర్గ సమావేశము జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీఆర్టీయు అధ్యక్షులు మిట్ట కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.ఎమ్. గిరి ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైష్ణవ కరుణానిధి మూర్తి లు హాజరుకావడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యలపై చర్చ జరిపి, పరిష్కరిస్తామని తెలిపారు. తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ఎన్వి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్.చాంద్ భాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రామ్ పక్కిరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడిగా భార్గవరామయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని మీట్టా కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. *ప్రధాన డిమాండ్లు* పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెండింగ్ డిఎ లు ఇవ్వాలని,ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని అన్నారు. 2003 డిఎస్సి వారికి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ వర్తించేలా చేయాలని,10 తరగతి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సెలవు రోజుల్లో లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. కృష్ణా రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు బి. విశ్వనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోపాల్ రెడ్డి, విజయ్ రావు, దేవనల శ్రీను, జాకీర్, హుసేన్ సాహెబ్, రవి, కృష్ణారావు, రవీంద్ర రెడ్డి, సుమియన్, హనుమంతు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :