ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని మిట్టకందాల- బుద్ధనగర్ గ్రామాల మధ్య అలగనూరు కెనాల్ పై ఉన్న శిధిలావస్థకు చేరిన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని టిడిపి మండల కల్చరల్ అధ్యక్షుడు భావన వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల కల్చరల్ అధ్యక్షుడు భావన వినోద్ కుమార్ మాట్లాడుతూ మిట్టకందాల, మజారా బుద్దానగర్ గ్రామంలో ఉన్న రైతులు ప్రతి ఒక్కరు ఈ బ్రిడ్జి మీదనే ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటో లు,ఈ బ్రిడ్జి మీద వెళ్ళాలనీ, ఇది శితిలావస్థ కి చేరిందన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కళ్ళు పక్క చూపులు చుసిన క్షణాల్లో ప్రాణాలు పోతాయనీ, దయచేసి సంబంధిత అధికారులు కొత్త బ్రిడ్జిని వెయ్యాలని, లేదా సైడ్ వాల్స్, సెక్యూరిటీ గోడలు అన్న వెయ్యాల్సిందని గ్రామస్థులు వాపోతున్నారు అని మండల టీడీపీ కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Admin
E Nivas News