ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీస్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ నకు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. కాంతారావు నాయక్ నంద్యాల జిల్లా వారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు డాక్టర్ ఏ.రాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ ఇక్బాల్, ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ సుభాషిణి, డెంటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ లు డాక్టర్ మస్తాన్ వలి, డాక్టర్ చిరంజీవి, కంటి వైద్యా నిపుణులు డాక్టర్ షేక్షావలి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్-కల్లూరి పెద్ద మస్తానయ్య లు ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నందు రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంటి వద్దనే 18 సంవత్సరాలు దాటిన పౌరునికి ఉచితంగా వైద్య పరీక్షలు ముందస్తు క్యాన్సర్ పరీక్ష నుండి రక్షణ పొందుట కొరకు రొమ్ము క్యాన్సర్ గురించి డాక్టర్- ఏ.రాయుడు తెలియజేయడం జరిగింది. పంటి క్యాన్సర్ గురించి డాక్టర్ సుభాషిణి అవగాహన కల్పించారు. ఎన్ సి డి- కంటి జాగ్రత్తల గురించి డాక్టర్-షేక్షావలి వివరించారు. క్షయ వ్యాధి గురించి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, నంద్యాల నేషనల్ హెల్త్ మిషన్ డిపిఓ- డాక్టర్ నస్మిన్ లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్, గోపాల్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్ మానస, రాఘవ, రెహనా, అరుణ, ఏసమ్మ, రజియా,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బైర్లూటి, కొట్టాలచెరువు, కొత్తపల్లి, గోకవరం ఎర్రమఠం పాములపాడు, వెలుగోడు, వేల్పనూరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, వార్డ్ హెల్త్ సెక్రెటరీ, ఆరోగ్య కార్యకర్తలు, పాల్గొన్నారు.
Admin
E Nivas News