Thursday, 30 July 2026 06:29:40 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పాములపాడు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం:-ఈ.వి.నాగ లక్ష్మిదేవి (పిహెచ్సి వైద్యాధికారిణి)

Date : 28 June 2026 08:47 PM Views : 91

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలంలోని, అన్ని గ్రామాలలో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఎంపీపీ- టి.సరోజిని వర్జినియా, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ఈ.వి.నాగలక్ష్మి దేవి, డాక్టర్ ఎం.మొహమ్మద్ బేగ్, సిహెచ్ఓ జి.అన్నమ్మ, సూపర్వైజర్ ఏం.మద్దయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, సూపర్వైజర్ రత్నమ్మ, పద్మావతి, ఫార్మసిస్టు బి.మూసా సలాం, హెల్త్ అసిస్టెంట్ లు డి.రాములు నాయక్, ఎం.పుల్లయ్య, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, ఎంఎన్ఓ లు ఎన్.శాలు భాష, సి.హరికృష్ణ, ఎస్ఏడబ్ల్యు ఎన్.పుల్లయ్య, మండలంలోని ఎంఎల్ హెచ్పి లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి ఇ.వి.నాగలక్ష్మి దేవి మాట్లాడుతూ పాములపాడు మండలంలో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి మండలం మొత్తం 27 బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు ఒకటి మొబైల్ టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్టాండ్ సెంటర్లో ప్రయాణికుల కోసం 27 నెంబర్ పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు గంగా, తదితర ప్రాంతాలలో పనులు చేస్తున్న కూలీల పిల్లల కోసం మొబైల్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పోలియో చుక్కలు ఈరోజు దాదాపు 95% వరకు పిల్లలకు వేయడం జరిగిందని, రేపు, ఎల్లుండి మిగతా తప్పిపోయిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి మా వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. మొత్తానికి అందరి సహకారంతో పాములపాడు మండలంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :