Friday, 31 July 2026 11:50:22 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాములపాడులో కులమతాల సరిహద్దులను చెరిపేస్తూ గత మూడు రోజులుగా వర్షాల కోసం ముస్లిం సోదరులు చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలు

Date : 21 July 2026 01:13 PM Views : 147

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో, రాజకీయాలకతీతంగా, మత సామరస్యానికి ప్రతికగా, మానవత్వానికి వేదికగా కేవలం తమ మత సాంప్రదాయాలకే పరిమితం కాకుండా ముస్లిం సోదరులు వర్షాల కోసం గత మూడు రోజులుగా ప్రత్యేక ఇస్తిక్క నమాజ్ చేసి, మానవులు చేస్తున్న తప్పులను క్షమించాలని, కరుణించాలని అల్లాకు దువా చేయడం జరిగింది. ఈనెల 19, 20, 21న జరిగిన కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా, కుల,మతాలకు అతీతంగా, సకల జీవరాశులకు ప్రాణాధారమైన వర్షం కురవాలంటూ మౌలానాలు షేక్.సుభాన్, షేక్.ఆరిఫ్ బాష, మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, నూర్ భాషా సంఘం అధ్యక్షుడు పీ.మౌలాహుసేన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలి, వైఎస్ఆర్సిపి నాయకుడు రుద్రవరం హుసేన్ భాష(మున్నా), మజీద్ ల ఇమాములు ఇస్మాయిల్, హాజీ షేక్.మహబూబ్ బాష, కంబాలపల్లి గపూర్, మజీద్ కమిటీల ప్రతినిధులు కె.ఎస్.ఎం.ఖాసిం, గౌండ షేక్.అన్వర్ భాష, టైలర్ భాష, హాఫిజ్ లు అబ్దుల్ బషీర్, జబివుల్లా, ఆరిఫ్, తదితర ముస్లిం పెద్దలు, యువకులతో కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో, ఏడ్చి ఏడ్చి ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వర్షాభావ పరిస్థితులు తొలగి, వర్షాలు బాగా పడి ప్రజలకు, రైతులకు ఉపశమనం కలగాలని అల్లాను వేడుకున్నారు. ప్రార్థనల సందర్భంగా శాంతి, సామరస్యం, ప్రజల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక దువాలు చేశారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరిగింది. ప్రజలు సహనం, ఐక్యతతో ప్రకృతిని కాపాడాలని మత పెద్దలు సూచించారు. రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని, గత కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ అల్లా దయవల్ల వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు బాగా పండాలని ప్రత్యేక ప్రార్థనల్లో అల్లాను వేడుకున్నారు. నంద్యాల జిల్లాతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వర్షాలు కురవాలని, కోటాను, కోట్ల జీవరాసుల దహర్తిని తీర్చడానికి ఆ అల్లా దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు లేని పరిస్థితుల వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత సంవత్సరం ఈ సమయానికి దాదాపుగా అన్ని ప్రాజెక్టులు, డ్యాములు, నదులు నిండాయని, కానీ ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల కరువు పరిస్థితుల వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో ఇస్తిస్కా నమాజ్, ప్రత్యేక దువా చేయడం వల్ల ఆ అల్లా కరుణ, కటాక్షాల వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ ప్రత్యేక ప్రార్థనలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు షఫీ, ఎస్.జంషీర్ భాష, జబివుల్లా, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముస్లిం-నూర్ భాషా సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: