Thursday, 30 July 2026 10:15:18 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

వెలుగోడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఘనంగా "మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ (మెగా పీటీమ్ 4.0)

Date : 24 July 2026 10:49 PM Views : 41

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : మండల కేంద్రమైన వెలుగోడులోనీ, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ప్రిన్సిపాల్ సుభాషిణి ఆధ్వర్యంలో, పిల్లల బంగారు భవిష్యత్ కోసం- బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీయం-4.0) అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ్ కాంత్, విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ్ కాంత్, హాస్టల్ ప్రిన్సిపాల్ సుభాషిని, విద్యా కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం, పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని ఎంతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి, వంట ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన స్వయంగా తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :