ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నేడు ఆత్మకూరు మండలంలోని, కరివేన గ్రామం లోని మారియా హైస్కూల్ నందు ట్రూ కోడ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన "వాక్ ఇన్ రిక్రూట్మెంట్ డ్రైవ్"కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ మరియు పరిసర గ్రామ నిరుద్యోగ యువతి, యువకులు ట్రూ కోడ్ అకాడమీ వారు ఫాక్స్ కాన్ మరియు సన్ మొబిలిటీ కంపెనీ లలో ఏర్పాటు చేసిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మారియా హై స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ ఖాలిక్, ట్రూ కోడ్ అకాడమీ సీఈఓ అక్రమ్ అలీ, కంపెనీల ప్రతినిధులు, జుబేర్ , యువతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News