ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన పట్నం సామేలు ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకుని, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ వారి నివాసానికి వెళ్లి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రూ.5,000/- ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని సింగపూర్ నుంచి వరల్డ్ హ్యూమన్ రైట్స్ వార్డ్ గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేశ్, చెంచాని వేమారెడ్డి, రమేష్ రెడ్డి, సిరిపిరెడ్డి వేమా రెడ్డి, నారాయణ రెడ్డి, చిన్నస్వామి ఆచారి, సుబ్బారావు, రత్నాకర్, జీవన్న, చిన్న సుబ్బయ్య, మొగిలి శ్రీను, శేషి రెడ్డి, సురేష్, మురహరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News