ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, కౌటాల మండలాల్లోని రైతు వేదికల వద్ద ఈ రోజు సిర్పూర్ మండలానికి చెందిన 72 కౌటాల మండలానికి చెందిన 68 మంది లబ్ధిదారులకు గురువారం కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఆడపిల్లల పెళ్లి కోసం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రమోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కొమురం మంతయ్య, ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్ ఐ ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ వేణు, సర్పంచులు నక్క శంకర్, వొడ్డేటి నానయ్య నాగమణి, రేచర్ల రజినీ మహేష్, ఛత్రు నాయక్,యోగి దాస్, రాందాస్, తాను భాయ్,ఉప సర్పంచ్లు దుర్గం ప్రశాంత్, శేఖర్, మోహన్, వార్డు సభ్యులు బనర్కర్ సాయి, గణేష్, మచ్చ గణేష్, నాయకులు కుంచాల విజయ్, దుర్గం మోతిరం, వాణు పటేల్, మధుకర్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News