ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సూర్యభానుడు దినదినం ఉగ్రరూపం ప్రదర్శిస్తుండడంతో పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ సహా వివిధ జిల్లా కేంద్రాల్లోని రహదారులపై జన సంచారం తగ్గుతోంది. ఓ వైపు ఎండ వేడి, మరో వైపు తీవ్రమైన ఉక్కపోత తో ప్రజలు అల్లాడిపోతు న్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించ నున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23వ తేదీ వరకుతరగతు లు నిర్వహించుకోవచ్చు నని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంట ల వరకు పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు కూడా కచ్చితంగా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎవరికీ మినహాయింపు ఉండదని.. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు తెరిచి ఉండటానికి వీల్లేదని అధి కారులు స్పష్టం చేశారు.ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి.. వేసవి సెలవులపై కూడా తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఏఫ్రిల్ 23 స్కూళ్లకు చివరి పని దినం కాగా.. ఏఫ్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది. 2026-27 విద్యా సంవత్స రానికి సంబంధించి జూన్ 12న తిరిగి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసా గుతుండగా.. ఈనెల 19న రంజాన్ పండగ నిర్వహిం చుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లలో టైమ్ టేబుల్ మార్చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ స్కూళ్లలో తరగతులు నడుస్తున్నాయి. ఈ టైమ్ టేబుల్ మార్చి 15 వరకు ఉండనుంది. ఆ తర్వాతఈస్కూళ్లలోనూ మధ్యాహ్నం 12.30 గంటలవరకుతరగతులు నిర్వహించనున్నారు.
Admin
E Nivas News