Wednesday, 17 June 2026 01:35:33 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఆదివాసి మహిళ ఎమ్మెల్యేకోవ లక్ష్మిపై అక్రమ కేసు పెట్టడంపై తీవ్రంగా ఖండిస్తున్నాం...

Date : 25 February 2026 10:41 PM Views : 278

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుంరం భీం ఆసిపాబాద్ జిల్లా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే కోవలక్ష్మి పై మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి సంఘటనలో ఏ 12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా సర్మీడి దుర్గు పటేల్ మాట్లాడుతూ రక్షణ కల్పించవలసిన పోలీసులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సంఘటన స్థలంలోకి సానుభూతి తెల్పడాన్నికి వెళితే మహిళా పోలీసులను అడ్డంపెట్టి రాజ్యాంగ బద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక ఆదివాసి మహిళ ఎమ్మెల్యే అని కూడ చూడకుండ ఎప్పుడు లేని విధంగా మహిళా పోలీసులను అడ్డం పెట్టి ఎమ్మెల్యే ని నెట్టు కుంటూ తీసుకు వెళ్లడం ఎంతవరకు న్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే పై కేసు బనాయించడాన్నీ, ఆదివాసీ సంఘాలతో పాటు జిల్లా సర్మీడి మండల బీ ఆర్ఎస్ నాయకులందరు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుట్రపూరిత చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని, స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలఇళ్లు ముట్టడిస్తామని, తుడుం దెబ్బ ఆదివాసి సంఘాలు ఆదివాసీ సమాజం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందోళన కార్యక్రమాలు చేపట్టాక తప్పదని హెచ్చరించారు. తక్షణమే కోవ లక్ష్మి పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ మండలం బీ ఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :