ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాగ జ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ,ప్రతిపక్ష బీజేపీ పార్టీ కుమ్మక్కై ప్రచారం చేశారని అయినా మున్సిపల్ పీఠం తామే కైవసం చేసుకుంటామని కోనేరు కోనప్ప ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నివాసంలో బీ ఆర్ ఎస్ అభ్యర్థులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఎన్ని కుతంత్రాలు పాడిన ఇంకా బారాస పార్టీ ప్రజల గుండెల్లోనే ఉందన్నారు. ఇప్పటికే మోసపోయామంటున్నారని మళ్లీ మోసపోతామా అని ప్రజలే నిక్కచ్చిగా చెబుతున్నారని తెలిపారు. ఏది ఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయ డంకా మోగిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News