Thursday, 30 July 2026 01:57:26 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 08 January 2026 07:36 PM Views : 154

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టుమార్టం గది నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలనిఅధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని అవుట్ పేషంట్, ల్యాబ్, వార్డులు, పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఓ. పి. లో నమోదు అవుతున్న అనారోగ్య సమస్యల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరిస్తూ సాంకేతిక పరికరాలను సమకూర్చి ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా అధికంగా వచ్చే జలుబు, జ్వర పీడితులకు వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందుల నిల్వలనుఅందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: