Thursday, 30 July 2026 12:26:56 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజయం

సీఎంను అభినందించిన ప్రియాంక గాంధీ

Date : 13 February 2026 11:55 PM Views : 130

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలతో రేవంత్‌ సమావేశమవుతున్నారు. శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంపై చర్చజరిగింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సాధించిన విజయంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి వచ్చిన మద్దతు ప్రజల విశ్వాసానికినిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయంతో పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహం నెలకొన్నదని, భవిష్యత్తు ఎన్నికల కోసం ఇది బలమైన పునాది అని ఆమెఅభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. పార్టీ శ్రేణులతో సమన్వయం, ఎన్నికల వ్యూహరచన, స్థానిక స్థాయిలో బలమైన ప్రచారం ఇవి విజయానికి దోహదపడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రియాంక గాంధీకి వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం వల్లే పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావడం, పారదర్శక పాలన అందించడం వల్ల ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు. ఈ భేటీలో తెలంగాణలో హస్తం పార్టీ బలోపేతం కావడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ శక్తిని మరింత పెంచే దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ విజయవంతమైన పాలన కొనసాగించేందుకు కేంద్ర నాయకత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచినట్లు సంకేతాలు అందుతున్నాయి. మొత్తంగా, ఢిల్లీలో జరిగిన ఈ భేటీ కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని నింపినట్లుగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :