Friday, 31 July 2026 02:29:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలి

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Date : 01 November 2025 10:14 AM Views : 233

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని మహబూబాబాద్ పోలీస్, ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ, 2కె రన్ ను జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో,లలు జెండా ఊపి ప్రారంభించారు. నెహ్రూ సెంటర్, జనరల్ హాస్పిటల్, ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగిన ఈ రన్ లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, డీఎస్పీలు, పోలీస్ యంత్రాంగం, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, స్థానిక యువతీ యువకులు, వాకర్స్, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగి ర్యాలీలో పాల్గొన్న వారితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గంలో యువతి, యువకులు, ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి ప్రయాణిస్తే మెరుగైన సమాజం నిర్మాణం కోసం మరింత కృషి చేసినట్లు అవుతుందన్నారు. ఆయన ఐడియాలజీ, యూనిటీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక మాట్లాడుతూ ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయి పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని మెరుగైన సమాజం కోసం ఆయన చూపిన మార్గాన్ని ఐకమత్యంతో అనుసరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు వివిధ కార్యక్రమాల ద్వారా జరుపుకొని త్యాగాలను గుర్తుకు చేసుకున్నామని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐడియాలజీ ప్రకారం జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఎదుర్కొని సమస్యలను అధిగమించి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే గతంలో వరదలు వచ్చిన సమయంలో పంపిణీలో చేసిన కృషి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని భవిష్యత్తులో కూడా ఇలా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, శ్రీనివాసరావు, విజయ ప్రతాప్, మోహన్, సిఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :