Friday, 31 July 2026 06:16:19 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు..! ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించాలి

జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

Date : 08 February 2026 08:06 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు 11 న జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది అని ఆదివారం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఎన్నికల సమయం మొదలు కొని ఫలితాలు వెల్లడించే వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అంతటా ముందస్తు చర్యలు చేపట్టామని, ఎన్నికల ప్రక్రియ మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎలక్షన్ సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలు మరియు కీలక ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రచార సమయం 9 సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులు ఎవరూ కూడా ప్రచారం నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కూడా కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్ డేగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో స్థానికేతరులు, ఓటర్లు కానివారు కాలనీలు, వార్డుల్లో సంచరించరాదని, అక్కడ ఉండకూడదని స్పష్టం చేశారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులు వంటి వాటితో ప్రలోభాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :