ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కరీంనగర్ లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో మంథని జె.కె.ఏ షోటోఖాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇనిస్ట్రక్టర్ కోండ్ర నాగరాజు ఆధ్వర్యంలో పాల్గొన్న విద్యార్థులు ప్రతిభను కనబరచి మెడల్స్ సాధించారు. బ్లాక్ బెల్ట్ కుమితే డుల్గచ్ దేవాన్ష్, పొట్ల శ్రావణ్ కుమార్ గోల్డ్ మెడల్స్, ఆల్ కలర్ బెల్ట్ కుమితే, కటా విభాగంలో సిద్ద శాన్విత (కుమితే) గోల్డ్ ,కుషాలి (కటా) గోల్డ్, నల్ల సాహితి కటా గోల్డ్, కుమితే సిల్వర్, వినయ్ కటా సిల్వర్, కుమితే బ్రాంజ్, వేదాన్ష్ కటా సిల్వర్, కుమితే బ్రాంజ్, క్రితిక సిల్వర్, కుంట్ట సాయి ప్రణవి,సమన్విత కుమితే బ్రాంజ్, మోక్ష కటా బ్రాంజ్, నురాజ్ కటా బ్రాంజ్, సిద్ద జైన కటా బ్రాంజ్ మెడల్స్ గెలుపొందటం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జె. కె. ఏ సౌత్ జోన్ ఇంచార్జ్ రాపోలు సుదర్శన్, తెలంగాణ స్టేట్ ఉపాధ్యక్షుడు నూకల బానయ్య, తెలంగాణ పేటా ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా కరాటే మాస్టర్లు అభినందించారు.
Admin
E Nivas News