Friday, 31 July 2026 04:52:56 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి..

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 09 January 2026 10:35 PM Views : 185

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, బాలల సంక్షేమ కమిషన్ చైర్మన్ మహమ్మద్ వహీద్ లతో కలిసి సంక్షేమ శాఖల అధికారులు, పోలీసు, కార్మిక, విద్య, వైద్య-ఆరోగ్య, పౌర సంబంధాల శాఖల అధికారులతో ఆపరేషన్ స్మైల్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడి వారికి మంచిభవిష్యత్తును అందించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. బడి బయట పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. కార్మిక శాఖల అధికారులు బృంద సభ్యులతో కలిసి పరిశ్రమలు, దుకాణాలు, నిర్మాణ ప్రాంతాలు ఇతర ప్రదేశాలను సందర్శించి బాల కార్మికులను గుర్తించాలని తెలిపారు. 14 సం॥లలోపు వయసు కలిగి బాల కార్మికులు పని చేస్తున్నట్లుగా గుర్తించినట్లయితే సంబంధిత సంస్థల యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, బాధిత బాలలకు నష్టపరిహారం అందించాలని తెలిపారు. బాల్యవివాహాలను నిర్మూలించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. గుర్తించబడిన బాల కార్మికులకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ నెల 1 నుండి 31 వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ నిర్వహించడం జరుగుతుందని, ఇటుక బట్టీలలో పనిచేసే వారి పిల్లలను పాఠశాలలో చేర్పించడం, అవసరమైన పుస్తకాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి సిహెచ్. దుర్గాప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, బాలల పరిరక్షణ కమిటీ అధికారి ఆనంద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :