ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆత్మకూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు అలీ హుస్సేన్ కు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చొరవతో టిడిపి అధిష్టానం జిల్లా అధికార ప్రతినిధిగా నియమించింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన అలీ హుస్సేన్ తెలుగుదేశం పార్టీలో సుమారు 40 సంవత్సరాలుగా మైనార్టీ నాయకులుగా ఉంటూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా కుటుంబానికి విధేయుడిగా, నమ్మిన బంటుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అలీ హుస్సేన్ సేవలను గుర్తించి జిల్లా అధికార ప్రతినిధిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధికార ప్రతినిధి అలీ హుస్సేన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధిష్టానం ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
E Nivas News