ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కేంద్ర ప్రభుత్వం రైతుల పంట కొనుగోలు కోసం తెచ్చిన నిబంధనలో సడలింపు ఇవ్వాలని లేనిపక్షంలో హర్యానా పంజాబ్ తరహా ఉద్యమాలు తప్పవని ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల శ్రీధర్ హెచ్చరించారు. గురువారం గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యాలయం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదురుకుంటున్న ఆ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా రైతులకు అకాల వర్షం వల్ల తీవ్రమైన పంట నష్టం జరిగితే మరోవైపు పంటల కొనుగోలు కోసం కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్నటువంటి సిసిఐ, ఎఫ్సిఐ లాంటి సంస్థలు, రైతుల పంటలను అమ్మకాలు చేయాలంటే ఈ-కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాలని నిబంధన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి అనేకమైన సాంకేతిక సమస్యలతో వారు స్లాట్ బుకింగ్ చేసుకోలేక పోతున్నారన్నారు. ఇది ఒక అనాలోచితమైన నిర్ణయం అని ఇలాంటి నిర్ణయాల వల్ల జిల్లా రైతాంగం నడ్డి విరిచినట్టయిం దన్నారు. గతంలో పంటలు కొనుగోలు చేసేందుకు ఎటువంటి నిబంధనలు లేవనిఇవి పెద్ద, వ్యాపారులకు ఉండని నిబంధనలు అన్నం పెట్టే రైతులకు ఎందుకు అని సీసీఐ, ఎఫ్ సీఐ,లు ప్రశ్నించారు. ఈ-కాపాస్ స్లాట్ బుకింగ్ నిబంధనలు తొలగించి పంటలు కొనుగోలు చేయాలని లేదంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా అడుగడుగునా అడ్డుకుంటాం అని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి తరపున బీజేపీ ఎమ్మెల్యేలను జిల్లా కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి.శ్రీధర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్యాల. కరుణాకర్, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిపవర్ రాజు, మండల కాంగ్రెస్ కమిటీ కోశాధికారి గేడంరామారావ్ పటేల్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు దుబ్బాక నరేష్, మండల కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి *కాక్డే.రాజు *కాత్లే, పరుశురాం రమేష్, సాహెబ్ రావ్ కామ్డే కినక శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News