Friday, 31 July 2026 09:42:27 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి...

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సాప్ కోడ్ ఇనోవేషన్ 2025–26 ప్రారంభంలో మంత్రి వివేక్

Date : 14 March 2026 07:04 AM Views : 200

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం మేడ్చల్ జిల్లా ఘాట్‌కేసర్‌లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాప్ కోడ్ ఇనోవేషన్ 2025–26 కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సాప్ కోడ్ ఇనోవేషన్ రూమ్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరంమంత్రి వివేక్ మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు రావడం తనకు ఎంతోఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఆలోచనతో ఈ విద్యాసంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలంటే శ్రద్ధగా వినడం, క్రమశిక్షణతో చదవడం ఎంతో అవసరమన్నారు. తన విద్యార్థి దశలో జరిగిన ఒక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఏ పని చేసినా శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం కొత్త కొత్త సాంకేతికతలు వస్తున్నాయని, వాటిని చూసి భయపడకుండా నేర్చుకోవాలని విద్యార్థులకుసూచించారు. సాంకేతికతను అవగాహన చేసుకుంటే భయం ఉండదన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంకటస్వామి సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం వివిధ కళాశాలల నుంచి వచ్చి సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పావనీ జంగయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: