ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మలనాగేశ్వరరావు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ( సీ.యస్ ) రామకృష్ణ రావు ఆధ్వర్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల జిల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలను కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని పని చేయాలని, ఎల్పీజీ కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలని తెలియ జేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ మాట్లాడుతూజిల్లా పరిధిలో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలను కట్టడి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎవరైనా అక్రమంగా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ ఉంచడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
Admin
E Nivas News