Friday, 31 July 2026 04:54:43 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

యువత క్రీడల్లో రాణించేందుకే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ

తహసీల్దార్ దిలీప్ కుమార్

Date : 08 January 2026 07:54 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : యువత క్రీడల్లో రాణించే ఆరోగ్య సమాజం కోసమే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ లక్ష్యమని అని తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్నారు. గురువారం జడ్పీ ఉన్నత బాలికల పాఠశాల నుంచి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు కల్పించి, క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పని చేస్తామని తెలిపారు. సీఎం కప్ -2026 పోటీలలో వివిధ క్రీడాంశాలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను గుర్తించి, వారికి తగిన ప్రోత్సాహకాలు, శిక్షణ అవకాశాలు కల్పించబడతాయన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వ వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగుతాయన్నారు. యువతకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకుమార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు, క్రీడా సంఘాలు, యువత అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్,ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :