Friday, 19 June 2026 01:22:47 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

బండి భగీరథ్ కేసులో కీలక మలుపు..! పోక్సో కేసులో కఠిన సెక్షన్లు జోడింపు

నోటీసులు జారీ చేసిన పోలీసులు

Date : 13 May 2026 09:38 PM Views : 136

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసులో మరింత కఠినమైన సెక్షన్లు చేర్చారు. ఇప్పటికే బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్‌విత్ 12 కింద కేసు నమోదు కాగా తాజాగా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎల్) రెడ్‌విత్ 6ను అదనంగా జోడించారు. ఈ కేసులో నేడు విచారణకు హాజరుకావాలని పోలీసులు భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. భగీరథ్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా కరీంనగర్ జ్యోతినగర్‌లోని ఆయన మేనమామ, వైద్యుడు సీహెచ్ వంశీకృష్ణ నివాసానికి పోలీసులు వెళ్లగాఅక్కడ ఆయన లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నోటీసు కాపీని కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. కేసు పర్యవేక్షణాధికారిణిగా నియమితులైన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు వివరాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు అధికారులతో సమావేశమై కేసులో కొత్త సెక్షన్లు చేర్చినట్లు సమాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది అక్టోబర్ 25న భగీరథ్ తన కుమార్తెను నానక్రాంగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి 2 నుంచి 3 రోజుల పాటు అక్కడే ఉండాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో మరో ఇద్దరు స్నేహితులు కూడా అక్కడ ఉన్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 13న మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో, డిసెంబర్ 31న మరో ఫామ్‌హౌస్‌లో కూడా లైంగిక వేధింపులు ఎదురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రీజర్ తాగాలని బలవంతం చేయడం, రాత్రి సమయంలో గదికి వచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనల సమయంలో అక్కడ ఉన్న యువకులు, యువతుల వాంగ్మూలాలను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :