Friday, 31 July 2026 07:28:53 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

24 గంటల్లో హత్య కేసు చేదించిన పోలీసులు

Date : 11 October 2025 08:49 PM Views : 420

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మీసేవ నిర్వాహకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేదించి నిందితులు ఐదుగురని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ సమాఖ్య కార్యాలయంలో మీసేవ నిర్వాహకుడు కోట చిరంజీవి (35), న్యూ మారేడుపాక హత్య కేసులో పోలీసులు 24 గంటల్లోనే నిందితురాలు సంధ్యారాణి, ఆమె భర్త కుమార్, తండ్రి మల్లయ్య, అన్న నరేష్, బావమరిది చందులను పోలీసులు అరెస్టు చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు చిరంజీవి సంధ్యారాణితో పరిచయం పెంచుకుని తరచూ కాల్స్‌ చేస్తూ వేధించేవాడు. భయంతో ఆమె దూరంగా ఉండగా, ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపుతానని బెదిరించడంతో సంధ్యారాణి తన భర్తకు విషయం చెప్పిగా గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. అయినప్పటికీ చిరంజీవి వేధింపులు ఆగలేదు. అక్టోబర్ 10న సంధ్యారాణి పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చిన చిరంజీవి సంధ్యారాణితో వాగ్వాదించగా ఆమె తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేయగా, వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు చిరంజీవిపై దాడి చేశారు. తండ్రి మల్లయ్య ముందుగానే తెచ్చుకున్న ఇనుపరాడుతో చిరంజీవి తలపై బలంగా కొట్టగా , భర్త కుమార్, అన్న నరేష్, బావమరిది చందులు కలిసి చిరంజీవి పై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఏసీపీ ఎం.రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితులను పెంచికల్‌పేట్ ఎక్స్‌రోడ్ వద్ద పట్టుకొని, మూడు బైక్‌లతో పాటు హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, చాకును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :