ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు .గురువారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల మూడో వార్డులో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షెట్టిపేట మండలం లోని కొత్తూర్ గ్రామాన్ని ఇటీవల టీబీ రహిత గ్రామంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా రెండవ విడత కార్యక్రమంలో అనుమానితులందరికీ ప్రజల వద్దకే వెళ్లి పోర్టబుల్ మోబైల్ ఎక్స్ రే ద్వారా ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి టీబీ నిర్ధారణ చేసినట్లు తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు , బిపి , షుగర్ వున్నవారు , గుట్కా, అంబార్ తోపాటు బీడీ , సిగరెట్, మద్యం సేవించేవారు మరియు గతంలో క్షయ వ్యాధి సోకినవారి కుటుంబ సభ్యులు తప్పని సరిగా ఈ వైద్య శిభిరాలలో పరీక్షలు నిర్వహించుకుని వ్యాధి నిర్ధారించుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మహాలక్ష్మి వాడ లో మరియు ఈ రోజు ఇటిక్యాల వార్డులో రేపు ఊత్కూర్ ఏరియా లో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపు లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సతీష్ కుమార్ కోరారు. గురువారం ఇటిక్యాల లో 90 మందికి ఎక్స్ రే పరీక్షలు 20 మందికి తెమడ పరీక్షలు,100 మందికి షుగర్, బీపి తోపాటు సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేసినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్ వైజర్ సురేష్ ,ఎంఎల్ హెచ్ పి అంజలి , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం లు విజయదర్షిణి, చిలకమ్మ మరియు ఆశావర్కర్స్ హైమవతి, విజయ,పద్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News