Friday, 31 July 2026 02:32:58 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

వామపక్ష పార్టీ ల డిమాండ్

Date : 23 December 2025 04:49 PM Views : 207

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దుచేసి పేదల పుట్టగొట్టే చట్టాన్ని నిరసిస్తూ మంగళవారం గాంధీ రోడ్డు లోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద తట్టలు, పారలు చేతబట్టి నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎ ఐ ఎఫ్ బి రాష్ట్ర కన్వీనర్ అంబటిజోగిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లానాయకులు జిందం ప్రసాద్ లు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకతీతంగా తన ఊపిరిపోయంత వరకు ప్రజల కోసమే పనిచేసిన మహానుభావుడు అడుగుజాడల్లో నడవవలసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాల్లు లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొడ్డానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఆ మహాత్ముని పేరు తొలగించి వికజిత్ భారత్ జి రామ్ జి చట్టం చేసిందన్నారు. ఆ మహాత్మా గాంధీ ఏం తప్పు చేశాడని పేరు మారుస్తున్నారనివారు ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక సొంత ఊర్లు ఖాళీ చేసి వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందని, అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి దొరుకుతుందని సంతృప్తిపడేలోపే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే కూలీలకు పనులు లేకుండా పస్తులు ఉండే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు పనిముట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కొత్త చట్టంలో పేర్కొనడం సిగ్గుచేటన్నారు. పాత చట్టంలో పనులు నిర్ణయించే అధికారం గ్రామ సభలకు ఉండేదని కొత్త చట్టంలో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ స్టాక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తద్వారా గ్రామ ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా కేంద్రం ఇష్టానుసారం పనులు కేటాయించే అవకాశం ఉందన్నారు. గత చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తే కొత్త చట్టంలో కేవలం 60 శాతం మాత్రమే నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 30% నిధుల భారం పడనుందన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిస్తుందన్నారు. ఓడదాటకముందు ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్ని చందంగా ప్రభుత్వం తయారయిందని కొత్త ఉపాధి పరిస్థితి దేవుడేరుగని, కూలీలు ఉపాధి ఎగ్గొట్టేందుకే పేరు మార్పు అని, నిధులు నిలుపుదల చేయుటకు ఈ కుట్ర జరుగుతుందన్నారు. ఉపాధి హామీ చట్టం తేవడం కోసం 2004 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీల ఎంపీలు ఒత్తిడి తీసుకువచ్చి మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకురావడం జరిగిందని బిజెపి ప్రభుత్వం పేరు మార్చిన జిరాంజీ ఆనాడు పార్లమెంటులో ఈ చట్టాన్ని వ్యతిరేకించాడని వారు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వo తక్షణమే స్పందించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలని లేనిపక్షంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు గుడి కందుల సత్యం, గిట్ల ముకుంద రెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సత్యరావు, రాజశేఖర్, మల్లేశం రాజేశం, అజయ్ గజ్జల శ్రీకాంత్, జి తిరుపతి నాయక్, గామినేని సత్యం, బాకం అంజయ్య, చెంచల మురళి, పుల్లెల మల్లయ్య రాయి కంటి శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వినయ్, శ్రీనివాస్,రాకేష్, సాయికుమార్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :