ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : హరితహారం మొక్కల పెంచిన డబ్బులపై విచారణ చేపట్టి బాదులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు హరితహారం మొక్కల పెంపకం డబ్బులు పంపిణీ పై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూమంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో హరితహారం మొక్కలు పెంచడానికి 12 ఎస్.హెచ్.జి గ్రూప్ సభ్యుల నుండి మొక్కలు పెంచినారు. పెంచిన మొక్కలను మున్సిపల్ అధికారులు తీసుకున్నారు. 2018-19, 2019-20 సంవత్సరాలలో పెంచిన మొక్కలు తీసుకున్న అధికారులు వారి డబ్బులు ఎస్.హెచ్.జి గ్రూప్ సభ్యులకు చెల్లించలేదు. 2020 మాత్రమే నుండి డబ్బులు చెల్లించారని తెలిపారు. మాకు వచ్చే డబ్బులు చెల్లించాలని గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా మా సమస్య పరిష్కారం చేయలేదన్నారు.పెంచిన మొక్కలకు సంబంధించి డబ్బులు మొత్తం ఎస్. హెచ్.జి సభ్యులకు ఇచ్చినట్లు అధికారులు తెలియజేశారు. కానీ ఆ డబ్బులు మాత్రం మొక్కలు పెంచిన ఎస్. హెచ్. జి సభ్యులకు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు దాసరి రాజేశ్వరి భాగ్యలక్ష్మి అనిత సుజాత తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News