Thursday, 30 July 2026 01:02:58 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం – ప్రమాదాలను నివారిద్దాం..! హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి

పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

Date : 19 January 2026 08:14 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకుని విలువైన ప్రాణాలను కాపాడుకోవాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజున బ్లాక్ స్పాట్ల సందర్శన, ప్రజలు, వాహనదారులతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌లతో కలిసి మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లాక్ స్పాట్లను సందర్శించి, ప్రజలు, వాహనదారులతో మాట్లాడి ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి గమ్యాన్ని చేరుకునేలా ప్రజల్లో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి సారి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ మద్యం సేవించి వాహనం నడపకుండా, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ తమ కుటుంబాలను, సమాజాన్ని సురక్షితంగా ఉంచాలని వాహనదారులను కోరారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ రాజు, ఎస్సైలు రమేష్, ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :