ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతిరోజు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ చెక్ పోస్ట్ వద్ద ప్రధాన రహదారిపై మండల అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం ఈ తనిఖీలు జరిగాయి. ప్రజలు రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన ధృవపత్రాలు చూపాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీఓ జలంధర్, ఎస్సై గొల్లపల్లి అనూష తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News