ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేద ప్రజల సొంతింటి కళ నెరవేస్తూ ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. సోమవారం మంచిర్యాల భవనాల నిర్మాణ సంఘాల నాయకులతో ఎమ్మెల్యే సమావేశంనిర్వహించారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంఘ నాయకులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 2,40,000 రూపాయల కన్న ఎక్కువగా తీసుకోవద్దని చెప్పారు.ఎమ్మెల్యే చెప్పి మాటలకు గౌరవిస్తూ సంఘ నాయకులు సానుకులంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ,భవన నిర్మాణ సంఘ అధ్యక్షులు పడాల రామన్న, ప్రధాన కార్యదర్శి మురళి మోహన్, కార్పొరేటర్లు బండారి సుధాకర్ , రాచకొండ గోపాల్ రావు ,సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News