ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంథని పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా బీజేపీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని సర్పంచ్, వార్డ్ సభ్యుల అభ్యర్థులుకు దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సమిష్టి గా కృషి చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమలు ప్రజలకు వివరిస్తూ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించి బీజేపీ పార్టీ సత్తా చాటలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాష్ట్ర నాయకులు కొండా పాక సత్య ప్రకాష్ గారు, చల్లా నారాయణ రెడ్డి గారు, మండల అధ్యక్షులు, యువ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News