Friday, 31 July 2026 02:31:18 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రతి బీసీ బిడ్డ పూలే చరిత్రను అర్థం చేసుకోవాలే

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

Date : 28 November 2025 07:10 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రను ప్రతి బీసీ బిడ్డ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. జ్యోతీరావు పూలే వర్థంతి సందర్బంగా మంథనిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పుట్టి మధు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లైనా అత్యధిక శాతం బీసీలకు పూలే అంటే తెలియకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ సామాజికవర్గానికి అంబేద్కర్‌ అర్థం అయిండు కానీ బీసీ వర్గాలకు పూలే అర్థం కాలేదన్నారు. నాటి నుంచి నేటి వరకు మహనీయులను వాడుకుని అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్‌ పాలకులు అటు తర్వాత వారిని విస్మరిస్తున్నారని వివరించారు. ఇప్పటికి బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అని చెప్పి కేవలం 17శాతం మాత్రమే అమలు చేశారని, ఇదే కాంగ్రెస్‌ నైజం అని గమనించాలని, ఇదే విషయాన్ని ఆనాడు పూలే చెప్పారన్నారు. రాముడు కృష్ణుడి చరిత్ర తాల పత్ర గ్రంథాల్లో రాసి ఉందని పురోహితులు చెప్తే మనకు తెలుస్తుందని, కానీ ఆనాడు పరిపాలించిన బ్రిటిష్‌ పరిపాలన అనంతరం వచ్చిన రాజ్యాంగంలో పూలే చరత్ర ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. అప్పటి చరిత్రనే పూలే చరిత్ర ఉందని కానీ ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపెరిగిన తరుణంలో యూట్యూబ్‌పెన్‌ చేస్తే అన్ని విషయాలను తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. తన పుట్టుక గురించి ఎవరికి తెలియకపోయినా తన చావు మాత్రం గొప్పగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం అనుసరించే అన్ని అమలు చేయాలన్నదే తన పోరాటం అని ఆయన తెలిపారు. తాను ఎమ్మెల్యే కాక ముందు నుంచే మహనీయుల చరిత్రను చాటి చెప్తున్నామని, 2016లో ఇక్కడ పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పదేండ్లకే రిజర్వేషన్‌లు ఉండాలని రాజ్యాంగంలో పోందుపరిస్తే ఇరువై ఎండ్లు పెంచుకోవాలని చూస్తున్నారని అన్నారు.ఒకరు ఎదిగితే మరో పదిమందిని పైకి తీసుకురావాలని చూడాలే తప్ప, కేవలం మనమే ఎదుగాలని చూడద్దని ఆయన సూచించారు. ఒక కవి, ఒక సైంటిస్టు, ఒక డాక్టర్‌, ఫిలాసఫర్‌ కలిస్తె జ్యోతిరావుపూలే అని అంత గొప్ప మహనీయుడని ఆయన అభివర్ణించారు, ఆనాడే వ్యవసాయం,చదువు మట్టి గురించి గొప్పగా ఆలోచన చేశారన్నారు, ఆనాడు బ్రాహ్మణులు నడిపిన పత్రికల్లో సైతం పూలే ఆలోచనలను రాశారని, అంత గొప్ప మహనీయుడి గురించి మనం అర్థం చేసుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.చదువు సంస్కారం భవిష్యత్‌ కోసమేనని చెప్పిన మహనీయుడని వివరించారు. వర్షాధారిత పంటలతో ప్రమాదం అని, చెరువులు, కుంటలు బావులు తవ్వడంతో పాటు గుట్టలపై చెక్‌డ్యాంలు నిర్మించుకోవాలని చెప్పాడని ఆయన గుర్తు చేశారు. ఓపెన్‌ కాస్ట్‌ సందర్శనలో బాల గోపాల్‌ సైతం పూలే మాటలనే గుర్తు చేశారన్నారు. మహనీయులను అర్థం చేసుకుంటేనే భవిష్యత్‌ బాగుంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్సోళ్లు కేవలం ఒక్కరినే పూజిస్తారని, వారి గురించే చెప్తరని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికి తాను ప్రతి రోజు మహనీయుల గురించే ఆలోచన చేస్తానని, పూలే చరిత్రలోని 65 అధ్యాయాల్లో 45 అధ్యాయాలు విన్నానని తెలిపారు. పూలే, అంబేద్కర్‌లను అర్థం చేసుకుని రేపటి తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు తనను ద్యేషిస్తారని, ఆనీ ఎందుకు ద్యేషిస్తున్నారో తెలియని, అలాగే తమ నాయకుడిని పొగుతారని, ఎందుకు పొగుడుతున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందన్నారు. భవిష్యత్‌ గురించి గొప్పగా ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావుపూలే, రాజ్యాంగం అందించిన అంబేద్కర్‌ల చరిత్ర తెలుసుకుని వారిని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జ్యోతిరావు సావిత్రీబాయి పూలే చిత్రపటాలను పలువురికి అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :