Friday, 19 June 2026 01:25:47 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

జగన్ ప్లాన్ అమలు చేస్తున్న జీవన్ రెడ్డి..

ఫలిస్తుందా పెద్దమనిషి కోరిక..

Date : 23 March 2026 09:41 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన జీవన్ రెడ్డి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం బహిర్గతమే. ముఖ్యంగా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడం, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడంపై రగిలిపోతున్న జీవన్ రెడ్డిఇప్పుడు పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు. కాగాఏదో పార్టీ మారిపోయి కండువా కప్పుకుంటే ఎఫెక్ట్ రాదనికొత్తగా ప్రయత్నిస్తన్నారు. జగన్ రెడ్డి ప్లాన్ ను అడాప్ట్ చేసుకుని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి యాత్ర చేయనున్నారు. గతంలో వైఎస్ జగన్ తనకు కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిందనే సెంటిమెంట్‌తో ఎలాగైతే ప్రజల్లోకి వెళ్లారో, ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అదే బాట పట్టారు. మార్చి 25న అధికారికంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, గ్రామ గ్రామాన తిరుగుతూ తన ఆవేదనను ప్రజలకు వివరించి, సానుభూతిని కూడగట్టాలని ప్లాన్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే తన తదుపరి రాజకీయ అడుగులపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చలు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనను విస్మరించిందనే పాయింట్‌ను బలంగా వాడుకుంటూ, ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానిలో చేరడం ద్వారా తనఉనికినిచాటుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, ఆయన ఏ జెండా పడతారనేది జగిత్యాల నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వయసు భారంతో పాటు రాజకీయ అనుభవం ఉంది. ఇక్కడ ప్రధానమైన చర్చ జీవన్ రెడ్డి వయసు, ఆయనకున్న ప్రజాదరణ గురించి సాగుతోంది. జగన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ ఇమేజ్‌ను మార్కెటింగ్ చేసుకుని యువకుడిగా దూసుకుపోయారు. కానీ, జీవన్ రెడ్డి వయసు ప్రస్తుతం 75 ఏళ్లు దాటింది. ఈ వయసులో ఆయనకు ఈ పోరాటం అవసరమా అనే ప్రశ్న సామాన్య జనం నుండి వినిపిస్తోంది. జగిత్యాల ప్రజలకు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం తెలుసు. అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఆయన పడుతున్న ఆవేదన మధ్య ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇస్తారనేది కీలకం అయ్యింది. వయసు మళ్లిన వేళ ఆయన చూపే ఈ సెంటిమెంట్ కార్డ్ ఎంతవరకు పనవుతుందనేది అవుతుందనేది సందేహంగా మారింది. రాజకీయంగా పోరాడటానికే సిద్ధం.. రాజకీయాల్లో పట్టుదల ఉండటం మంచిదే కానీ, అది కాలం చెల్లిన వ్యూహాలతో సాగితే ఫలితం ఆశించినట్లు ఉండదు. జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి పునరుజ్జీవం పోయాలనుకుంటున్న ఈ ప్రయత్నం, ఆయనను మళ్ళీ హీరోగా నిలబెడుతుందా లేకరాజకీయ విరామానికి దారితీస్తుందా అనేది చూడాలి. సెంటిమెంట్‌ను నమ్ముకుని ఆయన చేస్తున్న ఈ రాజకీయాన్ని ఎలా చూస్తారన్నది ఆసక్తికరంగా మారింది.నియోజకవర్గంలో ఆయనకున్న పాత కేడర్ ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నప్పటికీ, తటస్థ ఓటర్ల తీర్పు మాత్రం జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: