Friday, 31 July 2026 02:32:23 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

Date : 23 October 2025 08:04 PM Views : 347

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా మొరం తరలిస్తున్నారని అంతేకాకుండా పలు వెంచర్ లకు సరఫరా చేసి దందా నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. గురువారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లో మాట్లాడుతూ లక్షెట్టిపేట, దండేపల్లి, మండలాల్లో మొరం అమ్ముకుంటున్న తీరుపై సంబంధిత మైనింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా మొరంతరలింపులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, మేము ఆ అక్రమాల గురించి మైనింగ్ ఏ డీ ని వివరాలు కోరితే తప్పుడు సమాచారం ఇచ్చారని పలు పత్రాలను చూపించారన్నారు. అంతేకాకుండా మైనింగ్ అధికారులు ఇచ్చిన వివరాల కంటే ముందే కొన్ని ట్రాక్టర్లు, టిప్పర్లను పోలీసులు తాత్కాలికంగా సీజ్ చేసిన ఆధారాలు పేపర్లలో వచ్చాయాని వివరించారు. పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం సరఫరా చేయాల్సిన మొరం, ఇసుక వ్యవహారాల్లో అవినీతి జరుగుతుందన్నారు. ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఇది భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య విషయంలో జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హాస్టల్స్ నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగయ్య, శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య,లక్షేట్టిపేట, దండేపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :