Thursday, 30 July 2026 04:02:31 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు..

50 మందికి ఉపాధి కల్పించాలని బర్త్‌డే ఛాలెంజ్ విసిరిన పెద్దపల్లి ఎంపీ...

Date : 24 July 2026 11:11 PM Views : 66

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంకుల్‌కు శుక్రవారం 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక బర్త్‌డే ఛాలెంజ్ విసిరారు. 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం 50 మంది యువతకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఎంపీ "కేటీఆర్ అంకుల్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు పదేళ్లపాటు మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఈ 50వ జన్మదినం సందర్భంగా కనీసం 50 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీకు బర్త్‌డే ఛాలెంజ్ విసురుతున్నాను అన్నారు. అదే మీ జన్మదినానికి సమాజానికి అందించే ఉత్తమ బహుమతి అవుతుందన్నారు.అలాగే గతంలో గ్లోబరీనా సంస్థ, పేపర్ లీకేజీల అంశాల నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగానష్టపోయారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి అండగా నిలవాలని కేటీఆర్ అంకుల్‌ను కోరారు. జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని, యువతకు ఉపాధి కల్పించడం, బాధిత విద్యార్థులకు సహాయం చేయడం వంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.చివరగా కేటీఆర్ అంకుల్‌కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,జై హింద్, జై తెలంగాణ" అంటూ తన సందేశాన్ని ముగించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :