Friday, 31 July 2026 10:43:23 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వేలాల గట్టు మల్లన్న దర్శనం చేసుకున్న మంత్రి వివేక్ దంపతులు...

Date : 15 February 2026 11:29 PM Views : 169

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామిని శివరాత్రి పర్వదినాన ఆదివారం రాష్ట్ర మంత్రి వివేక్ తో పాటు ఆయన సతీమణి సరోజ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఒగ్గు పూజారులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వివేక్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా దాదాపు మూడు కిలోమీటర్లు గుట్టపైకి నడిచి స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రజలంతా చల్లగా ఉండాలని పూజలు చేసినట్లు తెలిపారు. అనంతరం చెన్నూరు మండలంలోని కత్తెరసాల మల్లన్న స్వామిని కూడా దర్శించుకుని పూజలు నిర్వహించి అక్కడ కూడా శివుడు అందరిని చల్లగా చూడాలని కోరినట్లు తెలిపారు. ఉదయం నుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పక్కనే గల పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. వేలాదిమంది భక్తులతో రావడంతో క్షేత్రాలు జన సందోహంతో శివనామస్మరణతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు రాత్రి ఆలయ సమీపంలో జాగరణ కూడా చేయనున్నారు. వీరందరికీ షామియానా లు ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. మంత్రి వెంట నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :