Wednesday, 08 April 2026 03:15:55 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్..

Date : 01 April 2026 10:51 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో అనుమతిలేని ఇసుక దందాలకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ కె హరిత బుధవారం స్వయంగా రంగంలోకి దిగారు. కొమురం భీం జిల్లాలో అనుమతిలేని ఇసుక నదీ గర్భాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా విరుచుకుపడ్డారు. బుధవారం రెబ్బెన మండలం రాంపూర్ శివారులో కలెక్టర్ జరిపిన మెరుపు తనిఖీలో జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగజ్ నగర్ పెద్దవాగును అడ్డాగా చేసుకుని ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను కలెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపూర్ గ్రామం సమీపంలో వాగు నుండి ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆమె స్వయంగా అడ్డుకున్నారు. అధికారుల కళ్లు గప్పి ఇసుకను తరలించవచ్చన్న ధీమాతో ఉన్న అక్రమార్కులకు కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ట్రాక్టర్లను పరిశీలించిన సమయంలో కనీసం అనుమతి పత్రాలు కూడా లేకపోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే ఆ వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి పర్యావరణాన్ని నాశనం చేసే ఇసుక మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోం అని జిల్లాలోని ప్రతి వాగుపై నిఘా ఉంచాం అన్నారు. ఇకపై తనిఖీలు మరింత ఉధృతం చేస్తాం అని తెలిపారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి నిఘా పెట్టడంతో జిల్లాలోని ఇసుక మాఫియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కార్యాలయాల్లో కూర్చోవడం మాత్రమే కాదు, అక్రమాలను అరికట్టేందుకు రోడ్ల పైకి వస్తామని ఆమె చేతల్లో చూపించడం,అధికారుల అండదండలతో సాగుతున్నాయో లేదా తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :