ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను కార్మిక వర్గానికి మరణశాసనం లాంటిదిఅని తక్షణమే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారంటి యు సి ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ భవనంలో సదస్సు ఏర్పాటుచేసి, మంచిర్యాల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టి యు సి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజన్న మాట్లాడుతూ కాంటాక్ట్ వర్కర్లు గా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని వారికి 26వేల రూపాయలు ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కార్మికులను రెగ్యులేషన్ చేయాలని ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని, కార్మికులకు భద్రత సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని కార్మికుల్ని నిరాయుధులను చేసి పెట్టుబడుదారులు పారిశ్రామికవేతలకు కార్పొరేట్లకు బంగారు పళ్లెములు పెట్టి బహుమాన ఇచ్చేందుకు సిద్ధమైందని వారు తెలిపారు. పోరాడి ప్రాణత్యాగాలతో సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా కోశాధికారి ఎండి గఫూర్. పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కట్ట లక్ష్మి. టి యు సి ఐ జిల్లా నాయకులు గంగామణి .భూషణ్ .గంగన్న. రాజేందర్. ఫెరోజ్. లక్ష్మి. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పద్మ కుమారి .ఎస్ఎన్ రెడ్డి. భుఖ్య రమేష్. సంజీవ్. తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News