Friday, 31 July 2026 01:51:43 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలి... మీనాక్షి నటరాజన్

Date : 25 February 2026 10:58 PM Views : 252

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు.వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణా శిబిరం ఐదవ రోజైన బుధవారం కార్యక్రమం జరిగింది. ఈ శిబిరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. యువత, మహిళలు రాజకీయాల్లోకిరావాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ రంగం, రాజకీయాల అనుసంధానంపై పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి పార్టీ స్థాయిలో చర్చలు జరిపి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, సాగు విధానాల్లో మార్పులు, మార్కెటింగ్ సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. శిబిరంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై స్పందన,సోషల్ మీడియా వినియోగం, బూత్ స్థాయి వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరం ద్వారా జిల్లాస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింతసమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :