ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు బుధవారం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు విషయంలో గత కొన్ని రోజులుగా లేనిపోని ఆరోపణలు చేస్తూ బిజెపి టిఆర్ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రైతులకు మద్దతుగా ఉన్నారని నిరూపిస్తూ మరోసారి రైతుల ఖాతాలు రైతుబంధు నిధులను జమ చేశారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగులకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని గుర్తుచేశారు.ముఖ్యంగా అన్నం పెట్టే అన్నదాతలకు తాను ఎప్పుడు అండగా ఉంటారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని నిరూపిస్తున్నారని తెలియజేశారు.ఇప్పటికైనా బిజెపి,టిఆర్ఎస్ నాయకులు రైతుబంధు విషయంలోనే కాకుండా వారికి సంబంధించిన ఏ విషయంలోనూ లేని పోనీ ఆరోపణలు చేసి రైతులను తప్పుదోవ పట్టించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు వినోద్, సతీష్, మంచికంటి సాయి, ఉషన్న,సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ నర్సారెడ్డి,ప్రకాష్ నవగరే,రవీందర్ పటేల్,సునీల్,సుధాకర్,కైపెల్లి నర్సింగ్, మారుతి, లాస్మన్న, తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News